Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు... భారీగా డ్రగ్స్ స్వాధీనం
ABN , Publish Date - Dec 16 , 2024 | 10:53 AM
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ బూతం వీడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలు, రాష్ట్రాల నుంచి సరఫరా అయిన డ్రగ్స్ ఇప్పుడు ఏకంగా దేశాలను దాటించి మరీ హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: డ్రగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలను కూడా డ్రగ్ ఫెడ్లర్‌లు పట్టించుకోని పరిస్థితి. షరా మామూలే అన్న చందంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు చిక్కడం.. ఆపై బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ డ్రగ్స్ సరఫరా చేయడం అనేది వారికి పరిపాటిగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో చాలామంది డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. చాలాసార్లు యువకులు, స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఎన్నో. విలాసవంతమైన జీవితం గడపాలని, అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో యువత ఈ దారిని ఎంచుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ నుంచి అక్రమ రవాణా
కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల మాదకద్రవ్యాలను రాచకొండ పోలీసులు ఇవాళ(సోమవారం) పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ నగరానికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర రాకెట్‌ను మీర్‌పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ జోన్ SOT పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించనున్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. గసగసాల , FM వంటి మాదక ద్రవ్యాలను మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
కఠిన చర్యలు..
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ బూతం వీడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలు, రాష్ట్రాల నుంచి సరఫరా అయిన డ్రగ్స్ ఇప్పుడు ఏకంగా దేశాలను దాటించి మరీ హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం, పోలీసులు చెప్పినప్పటికీ ఏదో విధంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తునే ఉన్నారు ముఠా సభ్యులు. ఇటీవల దాదాపు రూ.25 లక్షలు విలువల చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడ్లర్‌తో పాటు అంతర్రాష్ట్ర ఫెడ్లర్‌ను కూడా ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. అయితే తరచూ ఇలా డ్రగ్స్ పట్టుబడుతుండటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.
హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్..
అయితే తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మత్తుపదార్థాలు పట్టిపీడిస్తున్నాయి. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజుల వ్యవధిలోనే కొత్తకొత్త డ్రగ్స్ కేసులు నగరంలో వెలుగు చూస్తున్నాయి. ఎస్.ఆర్.నగర్ బాయ్స్ హాస్టళ్ల కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అలాగే నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు సైతం డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవేగాకుండా ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎన్ని కేసులు చేధించినా మత్తుపదార్థాల సరఫరాకు డ్రగ్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
డ్రగ్ పెడ్లర్లకు పోలీసుల హెచ్చరిక..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపారు. జూబ్లీహిల్ పబ్బులు సహా పలు ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల పలువురు బడా పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు సైతం మత్తుపదార్థాలు వాడి తనిఖీల్లో పట్టుబడ్డారు. అయితే యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు. బెంగళూరు నుంచి అధికంగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ పట్టుపడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు రెండు కీలక బిల్లులు..
K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..
Read Latest Telangana News and Telugu News