Share News

T.High Court: కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Jul 18 , 2024 | 01:55 PM

Telangana: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న (బుధవారం) జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో సంవత్సరంన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

T.High Court: కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో విచారణ
Telangana High Court

హైదరాబాద్, జూలై 18: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై గురువారం హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. నిన్న (బుధవారం) జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో సంవత్సరంన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ తెలిపారు.

AP Politics: పుంగనూరులో ఉద్రిక్తత.. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల రాళ్ల దాడి..



కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం వెల్లడించారు. హైదరాబాదులో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని హైకోర్టుకు సర్కార్ తెలియజేసింది. ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ ఉంటుందన్నారు. అయితే స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడి ఘటనలను ఆపుతారని హైకోర్టు మరో ప్రశ్న వేసింది.


షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నాగపూర్‌లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లో పెట్టినట్టు హైకోర్టుకు అనిమల్ వెల్ఫేర్ తరపున న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని ధర్మాసనం తెలిపింది. అలాగే తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Vinukonda Case: వినుకొండలో దారుణహత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన


సీఎం రేవంత్ ఆదేశాలు...

మరోవైపు కుక్కల దాడిలో బాలుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భ‌విష్య‌త్‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యా రోగ్య శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ

కుమ్మేయ్‌... అమ్మేయ్‌!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 02:00 PM