Drugs Case: రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ABN , Publish Date - Jul 18 , 2024 | 11:29 AM
Telangana: నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో 7 గురు ఫెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు ఉన్నారు.
హైదరాబాద్, జూలై 18: నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు (Drugs Case) రిమాండ్ రిపోర్టులో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో 7 గురు ఫెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు ఉన్నారు. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు.
TDP: టీడీపీలో చేరబోతున్నామంటూ వంశీ అనుచరుల హల్‌చల్..
నైజీరియా - ఢిల్లీ- హైదరాబాద్- ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ చేరుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎబుకా - బ్లెస్సింగ్ - ఫ్రాంక్లిన్ - అజీజ్ - గౌతం - వరుణ్ - ద్వారా డ్రగ్స్ సప్లై అయినట్లు గుర్తించారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పెడ్లర్లను నైజీనియన్లు ఆర్థికంగా ఆదుకుంటున్నారని... వాళ్లకు కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ఎంకరేజ్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
Somireddy: విజయసాయి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే
‘‘డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్‌గా నైజీరియానుకు చెందిన ఎబుకా. ఎబుకా నుంచి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలో రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై . ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు ఒప్పుకున్న బ్లెస్సింగ్. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు చేరుతున్న డ్రగ్స్. 9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు ఇచ్చిన నైజీరియన్. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లింపు. వరుణ్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై. తన స్నేహితురాలి పేరును తన పేరుగా మార్చుకున్న బ్లెస్సింగ్. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు. ఇంటర్ వరకు చదువుకున్న ఒనుహా. 2017 లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేసినట్లు’’ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ
Read Latest AP News And Telugu News