Share News

jp Nadda: తెలంగాణలో నడ్డా పర్యటన.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం

ABN , Publish Date - Sep 28 , 2024 | 07:52 PM

కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నడ్డా సూచించారు. పార్టీ లైన్ దాటకుండా ఎప్పటికప్పుడు.. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని నడ్డా హితవు పలికారు.

jp Nadda: తెలంగాణలో నడ్డా పర్యటన.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇవాళ(శనివారం) పర్యటించారు. హైదరాబాద్‌లోని హరిత టూరిజం ప్లాజాలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశంలో పాల్గొన్నారు.

bjp-2.jpg


bjp.jpg

కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నడ్డా సూచించారు. పార్టీ లైన్ దాటకుండా ఎప్పటికప్పుడు.. అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని నడ్డా హితవు పలికారు. పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలకు అవకాశం లేదని నడ్డా హెచ్చరించారు.

bjp-2.jpg


ALSO READ: TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని జేపీ నడ్డా ఆదేశించారు. తెలంగాణలో సభ్యత్వ నమోదుపై అరా తీశారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం కావాలని అన్నారు. లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలని నడ్డా ఆదేశించారు. నేతల మధ్య విభేదాలు లేకుండా సమన్వయంతో సభ్యత్వ నమోదు చేయాలని జేపీ నడ్డా సూచించారు.

bjp-4.jpg


అత్యధిక సభ్యత్వ నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని నడ్డా స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం అంశాలపై ఆరా తీశారు. ఈ సమావేశానికి రాష్ట్ర సభ్యత్వ ఇన్‌చార్జి అరవింద్ మీనన్, సంస్థగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బండి సంజయ్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాజరయ్యారు.

nadda-1.jpg


నడ్డాపై ఎంపీ ఈటల రాజేందర్ అసహనం

eetala.jpg

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జేపీ నడ్డాపై ఎంపీ ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదులో టైం గడువు విధించడం సరికాదని ఈటల రాజేందర్ అన్నారు పార్టీ అధిష్ఠానం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. గడువులోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టడం సరికాదని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Bandi Sanjay: హైడ్రా తీరుపై స్వయంగా పాట పాడిన బండి సంజయ్

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 08:00 PM