Delhi Liquor Case: కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు
ABN , Publish Date - May 07 , 2024 | 03:23 PM
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు(మంగళవారం) మరోసారి ఈ కేసు విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు(మంగళవారం) మరోసారి ఈ కేసు విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి. ఈ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ, సీబీఐ అధికారులు కోరారు. దీంతో ఈ నెల 20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కవితపై చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని కోర్టుకు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆమె జ్యుడీషియల్ కస్టడీ అంశంపై జడ్జి కావేరి బవేజా విచారణ జరుపుతున్నారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు
జైలులో కవిత చదవడానికి 10 పుస్తకాలు అనుమతించాలని కోర్టును ఆమె న్యాయవాది నితీష్ రానా కోరారు. కోర్టులో కవితను 15 నిమిషాల పాటు కలిసిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోర్టును న్యాయవాది కోరారు. జైలులో కవితకు తన భర్త తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలని కోర్టును నితీష్ రాణా కోరారు.
జైలులో కవితకు ఇచ్చే ఇంటి భోజనం 10-15 మంది పోలీసులు చెక్ చేసిన తర్వాత.. పాచిపోయిన ఆహారాన్ని ఆమెకు అందిస్తున్నారని.. అలా కాకుండా డాక్టర్, జైలు అధికారి పరిశీలించిన తర్వాత ఆహారాన్ని కవితకు అందించాలని కోర్టును కవిత న్యాయవాది కోరారు. ఆమె ఇంటి భోజనం వద్దన్న తర్వాత మళ్లీ ఎందుకు అడుగుతున్నారని జడ్జి న్యాయవాదిని ప్రశ్నించారు. కవితకు ఇంటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్‌ను వివరణ కోరతామని జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు.
వాళ్లను దేశం దాటించారు: కవిత
కాగా.. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్లను విడిచిపెట్టి, దేశం దాటించి నాలాంటి వాళ్లను అరెస్ట్ చేశారు. ఇది అన్యాయం, ఈ విషయాన్ని అందరూ గమనించాలి’’ అని కవిత పేర్కొన్నారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో కవిత..
అయితే.. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు సమాచారం. రేపు(బుధవారం) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో కవిత సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నిరాశ
Liquor Scam Case: వీడియో కాన్ఫరెన్స్ వద్దు.. కోర్టుకు నేరుగా హాజరుపర్చండి.. కవిత విజ్ఞప్తి..
Delhi Liquor Scam: ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
Read Latest News and Telangana News Here