Share News

Delhi Liquor Scam: సుప్రీం కోర్టులో కవిత పిటషన్.. నేడు విచారణ..

ABN , Publish Date - Mar 19 , 2024 | 09:31 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు.

Delhi Liquor Scam:  సుప్రీం కోర్టులో కవిత పిటషన్.. నేడు విచారణ..

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసు (Delhi Liquor Scam)లో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్‌ (Petition) దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి, ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరఫున న్యాయవాది ఆన్‌లైన్‌ పిటిషన్‌ (Online Petition) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

ఢిల్లీ మద్యం కేసు మనీలాండరింగ్‌ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఈడి జారీ చేసిన సమన్లు సవాలు చేస్తూ... గత ఏడాది మార్చి 14న కవిత రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను అంతకు ముందే దాఖలైన అభిషేక్‌ బెనర్జీ, నళినీ చిదంబరం పిటిషన్లకు సుప్రీం కోర్టు జత చేసింది. సిఆర్‌పిసి సెక్షన్‌ 160 ప్రకారం... మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా... ఈడి అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై అప్పుడే ధర్మాసనం ఈడికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం పలు మార్లు విచారణ జరిపింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో విచారణకు రావాలని ఈడి కవితకు సమన్లు జారీ చేసింది. తనకు ఈడి సమన్లు జారీ చేయడాన్ని గత ఏడాది సెప్టెంబర్‌ 15న సుప్రీంకోర్టులో కవిత తరపు న్యాయవాదులు ప్రస్తావించగా.,.10 రోజుల పాటు... తాము సమన్లు జారీ చేయబోమని సెప్టెంబర్‌ 15న చెప్పిన ఈడి తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు.

ఆ తర్వాత... పలుమార్లు విచారణ జరిగినా... ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ధర్మాసనం వాయిదా వేసింది. తాజాగా... ఈనెల 15న మరోసారి జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం ముందుకు కవిత పిటిషన్‌ విచారణకు వచ్చింది. అంతకు ముందు ఈడి మెన్షన్‌ చేయడంతో... ఈనెల 15న కవిత పిటిషన్‌ విచారణకు వచ్చింది.

నాన్‌ మిస్‌లేనియస్‌ డే రోజు చేపట్టాలని గతంలో నిర్ణయం జరిగిందని.. అందుకు అనుగుణంగా తదుపరి విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. అయితే కవిత న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవద్దని, ప్రతిసారి ఏదో ఒక సాకుతో పిటిషన్‌ విచారణకు రాకుండా చేస్తున్నారని ఈడి తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు అన్నారు. తాము ఇప్పుడు కూడా వాదనలు వినిపించడానికి సిద్దంగా ఉన్నట్లు ఎఎస్‌జి రాజు చెప్పారు. పదే పదే వాయిదాలు అడిగితే... కనీసం నోటీసు ఇచ్చే సమయం కూడా ఇవ్వబోమని రాజు చెప్పారు.

గతంలో నోటీసులు ఇచ్చి 10 రోజుల సమయం ఇస్తామని చెప్పామని.. ఇప్పుడు అది కూడా వెనక్కి తీసుకుంటామని ఎస్‌వి రాజు చెప్పారు. కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు పిటిషన్‌పై విచారణను మంగళవారం నాటికి జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా వేసిన రోజు (ఈనెల 15న) సాయంత్రమే కవితను ఈడి అధికారులు అరెస్టు చేశారు. 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి... వారం రోజులు కస్టడీకి ఈడి అధికారులు తీసుకున్నారు. ఈడి అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడి... కోర్టులో చెప్పిన మాటకు విరుద్దంగా అరెస్టుకు పాల్పడ్డారని కవిత నిన్న మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈరోజు రెండు పిటిషన్లు కలిపి న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉంది.

Updated Date - Mar 19 , 2024 | 10:55 AM