TS Politics: నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ప్లాన్ ఇదేనా..?
ABN , Publish Date - Feb 04 , 2024 | 10:18 PM
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) త్వరలో బహిరంగ సభ ద్వారా ప్రజల ముందుకు రాబోతున్నారు. కాంగ్రెస్ హామీలపై గులాబీ బాస్ ఈ సభలో ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలపై కూడా పార్టీ క్యాడర్‌కు సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) త్వరలో బహిరంగ సభ ద్వారా ప్రజల ముందుకు రాబోతున్నారు. కాంగ్రెస్ హామీలపై గులాబీ బాస్ ఈ సభలో ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలపై కూడా పార్టీ క్యాడర్‌కు సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు గెలుపే లక్ష్యంగా.. తొలుత నల్గొండలో భారీ నిరసన సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ, భువనగిరి గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారని.. అందుకే ఇక్కడ్నుంచే ఎన్నికల శంఖారావం మోగించుచున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ సభ ఉంటుందని సమాచారం.
నిరసన..
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో నిరసన సభ ఏర్పాట్లపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో తేదీ ప్రకటన వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.