Share News

TG NEWS: కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ.. కారణమిదే

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:07 AM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆదివారం మధ్యాహ్నం 1:30గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున స్వయంగా ఆహ్వానించనున్నారు.

TG NEWS: కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ.. కారణమిదే

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(KCR) ఇవాళ మధ్యాహ్నం 1:30గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున స్వయంగా ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో ఉందని, తెలంగాణ ఆనవాలు లేదంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే అసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి, ఆవిష్కరిస్తామని చెప్పింది. అన్నట్లుగానే.. గత ఏడాది డిసెంబరులో అధికారం చేపట్టిన వెంటనే విగ్రహం రూపకల్పనపై రేవంత్ ప్రభుత్వం దృష్టిసారించింది.

brs.jpg


ఇందులో భాగంగానే తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. 3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఈనెల తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించనుంది. బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర! రెండు చేతులకు ఎరుపు, ఆకు పచ్చ రంగు గాజులు! ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు! కాళ్లకు మెట్టెలు, పట్టీలు! మెడలో బంగారపు గొలుసులు! నుదుట రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో నిండైన గ్రామీణ మహిళ రూపంతో తెలంగాణ తల్లి తాజా విగ్రహాన్నిరేవంత్ ప్రభుత్వం రూపొందించాచింది. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.


కేసీఆర్‌ని కలుస్తా: మంత్రి పొన్నం ప్రభాకర్

ponnam.jpg

ఈరోజు కేసీఆర్‌ని కలుస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం రమ్మని కేసీఆర్ అన్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కేసీఆర్‌ని కలుస్తున్నానని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతానని చెప్పారు. రావడం రాకపోవడం కేసీఆర్ ఇష్టమన్నారు. గతంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు కేసీఆర్‌ని ఆహ్వానించినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ షార్ట్ ఫిలింలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి కూడా చెబుతే బాగుంటుందని అన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి బీజేపీ చేస్తున్న మోసాలను కూడా చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.


కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ

అలాగే రేపు(ఆదివారం) కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ జరగనుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఒంటిగంటకు సమావేశం ప్రారంభంకానుంది. ఈ నెల‌ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. ఓడిపోయిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్‌లో ఉండిపోయారు. అంతే కాదు ఎమ్మెల్యేగా, ప్రతిపక్షనేతగా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కేసీఆర్ పర్యటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14వ తేదీ నుంచి మొదలు సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 09వ తేదీ వరకు.. ప్రజా విజయోజ్సవాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. విజయోత్సవాలను ఘనంగా జరుపుతోంది.

brs-1.jpg


అసెంబ్లీకి ఇసారైనా కేసీఆర్ వస్తారా..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒక్కసారి గులాబీబాస్ అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంలోనూ కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై చర్చ జరిగింది.

kcr.jpg


ఇసారైనా అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ వస్తారా లేదా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి సహా.. పలువురు మంత్రులు సభలో మాట్లాడుతూ ప్రతిపక్షనేత ఎక్కడ దాక్కున్నారు? అసెంబ్లీకి రారా? అని బీఆర్‌ఎస్‌ సభ్యులను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. గతంలో కేటాయించిన చాంబర్‌ను ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేశాయి. కేసీఆర్‌కు ఇరుకైన చాంబర్‌ కేటాయించారని, తమ నేతను అవమానపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: రేవంత్ ప్రభుత్వం అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.. కేటీఆర్ ధ్వజం

CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 02:21 PM