Share News

Minister Damodar: ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి కావాలి

ABN , Publish Date - Sep 06 , 2024 | 10:01 PM

ప్రైవేట్ ఆస్పత్రులకు పోటీగా ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‎లోని కోటి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు(శుక్రవారం) నూతనంగా రూ. 121 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కాలేజీ హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Minister Damodar: ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి కావాలి

హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‎లోని కోటి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు(శుక్రవారం) నూతనంగా రూ. 121 కోట్లతో నిర్మించనున్న కాలేజీ హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైద్యారోగ్య శాఖలో 282 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం అంటే. మానవత్వ దృక్పథం, సేవా దృక్పథం ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.


వైద్య వృత్తి సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్‎గా వైద్య సిబ్బంది ఓపిక, ప్రేమగా పని చేయాలని సూచించారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. దేశంలో ఎక్కడికికెళ్లినా ఉస్మానియా అంటే హైదరాబాద్... హైదరాబాద్ అంటే ఉస్మానియా అంటారని గుర్తుచేశారు. గత 30 ఏళ్లుగా వైద్యశాఖలో పెండింగ్ సమస్యలు ఉన్నాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.


కొన్నేళ్లుగా వైద్యులకు స్టైపెండ్ రాలేదని.. కానీ తమ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఎంతో నిష్ణాతులైనా డాక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవస్థని పటిష్టం చేసేందుకే బదిలీలుసిందని వివరించారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం కోసం ఇప్పటికే నిధులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. 32 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.


పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం చేయలేనివి తాము ఇప్పుడు చేసి చూపుతామని వెల్లడించారు. కోర్టులో కేసు ఉన్నా కూడా తాము వే ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణానికి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వాలు... ఉంటాయి... పోతాయి... కానీ ప్రజలకు ఏమి చేశామనేది ముఖ్యమని తెలిపారు. మరో రెండు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 10:37 PM