Share News

Minister Krishna Rao: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. మంత్రి జూపల్లి ఏమన్నారంటే..?

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:29 AM

హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌‌ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఈరోజు(శనివారం) కూల్చివేసింది. ఉదయం నుంచి ఈ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్‌‌పై గతకొతకాలంగా పెద్దఎత్తులో ఫిర్యాదులు వస్తుండటంతో చర్యలు చేపట్టారు.

Minister Krishna Rao: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. మంత్రి జూపల్లి ఏమన్నారంటే..?
Minister Jupalli Krishna Rao

ఢిల్లీ: హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌‌ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఈరోజు(శనివారం) కూల్చివేసింది. ఉదయం నుంచి ఈ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్‌‌పై గతకొంతకాలంగా పెద్దఎత్తులో ఫిర్యాదులు వస్తుండటంతో చర్యలు చేపట్టారు. అయితే, ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) స్పందించారు.


Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి

ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని తెలిపారు. వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఢిల్లీలో మంత్రి జూపల్లి పర్యటిస్తున్నారు.


టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు..

అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడించారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణ అనుకూలంగా ఉందని వివరించారు. ఎకో, మెడికల్, టెంపుల్ టూరిజం అనుకూలంగా తెలంగాణ ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.


తమ ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి కోసం చాలా నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. నిధులు కూడా కేటాయించాలని కేంద్రమంత్రిని కోరామని తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం టూరిజంలో 9వ స్థానంలో ఉందని అన్నారు. టూరిజంలో ఒకటో ,రెండో స్థానంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:57 AM