Share News

TG News:బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:40 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) తెలిపారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి శనివారం సందర్శించారు.

TG News:బుద్ధవనాన్ని  పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
Minister Jupalli Krishna Rao

నల్గొండ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) తెలిపారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని చెప్పారు.


ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బౌద్ధ టూరిజం సర్క్యూట్‌లో తెలంగాణలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. భారతదేశానికి, ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. నాగార్జున సాగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

Ramoji Rao: రామోజీరావు నా రోల్ మోడల్: ఎమ్మెస్ కే ప్రసాద్

TG News: చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తిన ప్రజలు..

TG Politics: కేసీఆర్, జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు: ఎమ్మెల్యే వివేక్

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 04:49 PM