Minister Komati Reddy: కేటీఆర్ అధికారం పోయిన షాక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు
ABN , Publish Date - Jan 21 , 2024 | 09:03 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అధికారం పోయిన షాక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) ఎద్దేవా చేశారు.
యాదాద్రి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అధికారం పోయిన షాక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ తాము వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులు అయిందని.. తర్వలోనే హామీలు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని తెలిపారు. గృహాలకు ఉచిత కరెంటు పథకం విషయంలో ఆలోచించి మాట్లాడాలని కేటీఆర్‌కు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా బీఆర్ఎస్‌ని తాము బరాబర్ బొంద పెడతామని హెచ్చరించారు. ముఖ్యమైన బస్వాపూర్, మోడల్ క్రికెట్ స్టేడియం, భువనగిరి మున్సిపాలిటీ గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. భువనగిరిలో 100 కోట్లతో స్టేడియం నిర్మాణాన్ని జాతీయస్థాయిలో హైదరాబాద్ తర్వాత ఇక్కడ క్రీడలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భువనగిరి ఖిల్లా రోప్ వే పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.