Share News

Minister Konda Surekha: యాదగిరిగుట్టలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 18 , 2024 | 05:33 PM

యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలయంలో 14చోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 47 చోట్ల టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విష్ణు పుష్కరిణీ గుండాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

Minister Konda Surekha: యాదగిరిగుట్టలో  భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్: యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలయంలో 14చోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 47 చోట్ల టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విష్ణు పుష్కరిణీ గుండాన్ని ఏర్పాటు చేశామన్నారు. చంటి బిడ్డ తల్లులకు ప్రత్యేక లాంజ్‎లు, ఎలక్ట్రిక్ వాహనాల సౌకర్యం కల్పించామని చెప్పారు. రూ. 15కోట్లతో దాతల సహాయంతో అన్నదాన సత్రం నిర్మించామని మంత్రి కొండా సురేఖ అన్నారు.


60కిలోల బంగారు తాపడంతో రాజగోపురం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. లడ్డూ నాణ్యతలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. భద్రాద్రి అభివృద్ధి కోసం కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అన్నారు. రూ. 3కోట్లతో జానకి సదనం నిర్మిస్తున్నామని తెలిపారు. దేవాలయానికి సంబంధించిన 24సేవలు ఆన్ లైన్‎లో అందిస్తున్నామని ప్రకటించారు. వేములవాడ దేవస్థానానికి చెందిన 850కోడెలను రైతులకు అందించినట్లు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.


వీటీడీఏ(VTDA) కు ప్రభుత్వం రూ. 70 కోట్లు విడుదల చేసిందని ప్రకటించారు. వెండి పల్లకీలు, బంగారు తాపడం రాజగోపురం నిర్మించాలని నిర్ణయించామన్నారు. రూ.110కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మానం చేస్తామన్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని అన్నారు. ఆదాయం ఆధారంగా ఆలయాల వర్గీకరణ చేస్తామని వివరించారు. వివాదంలో ఉన్న దేవాదాయ, అటవీ శాఖ భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే

రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు

'ఆప్' మాజీ మంత్రికి బెయిల్

మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ బైక్.. ఫీచర్లు తెలిస్తే

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 18 , 2024 | 05:40 PM