Share News

Ponnam Prabhakar: అప్పుడు యాదికి రాలేదా?.. కవితకు మంత్రి పొన్నం కౌంటర్

ABN , Publish Date - Jan 22 , 2024 | 01:12 PM

Telangana: మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రతిష్టించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ వేదికగా కవితకు మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు.

Ponnam Prabhakar: అప్పుడు యాదికి రాలేదా?.. కవితకు మంత్రి పొన్నం కౌంటర్

హైదరాబాద్, జనవరి 22: మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రతిష్టించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేసిన డిమాండ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తనదైన శైలిలో స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ వేదికగా కవితకు మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని కోరం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి రాలేదా అని నిలదీశారు. మహాత్మా జ్యోతిరావు పూలే తమకు సర్వదా స్మరణీయుడు అని చెప్పుకొచ్చారు.


మంత్రి పొన్నం వ్యాఖ్యలివే...

‘‘అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహనీయుడి విగ్రహం అసెంబ్లీలో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరం. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలేను మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనం. అణచివేతకు వ్యతిరేకంగా పూలే సలిపిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శం. ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టుకున్నాం, ప్రజా పాలన అందిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే మాకు సర్వదా స్మరణీయుడు. బీసీలను వంచించిన మీరా బీసీల సంక్షేమం గురించి మాట్లాడేది?. మీ నియంతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌ను ఏడిపించింది మీరు కాదా? బీసీ బిడ్డగా అడుగుతున్నా.. మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు మీరు అధికారాలు ఇచ్చారు? బీసీ మంత్రిగా ఉన్నా.. నేను ఉద్యమకారుడినే.. అణగారిన వర్గాలకు ఆప్తున్ని, సబ్బండ కులాలకు సోదరుడిని. మంత్రిగా ఉండి బీసీల హక్కుల కోసం పోరాడతా. మీ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక అధ్యక్ష పదవి, లీడర్ ఆఫ్ అపొజిషన్ బీసీలకు ఇవ్వగలరా? గత మీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ బీసీలకు ఎందుకు ఇవ్వలేదు?’’ ఎక్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 22 , 2024 | 01:12 PM