Share News

Minister Sridhar Babu: మేము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు..

ABN , Publish Date - Aug 17 , 2024 | 07:19 PM

రాబోయే 20ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటో తెలిపేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు చేసినట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Shridhar Babu) తెలిపారు.

Minister Sridhar Babu: మేము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు..

హైదరాబాద్: రాబోయే 20ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటో తెలిపేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు చేసినట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Shridhar Babu) తెలిపారు. తాము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదని మంత్రి చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ సంస్థలకు నమ్మకం కలిగించేందుకే పర్యటన చేసినట్లు చెప్పుకొచ్చారు.


అమెరికా, దక్షిణ కొరియా పర్యటన(America and South Korea tour)లో రూ.31వేల కోట్ల పెట్టుబడులు, 19 MOUలు చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వీటి వల్ల 30వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. ఏఐ, స్కిల్ యూనివర్సిటీ, మూసీ నది అభివృద్ధిపై పలువురితో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం అమెరికాకు సీఎం వెళ్లడం ఇదే తొలిసారని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ ఘనత కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు.


ఈ పర్యటన వల్ల కాగ్నిజెంట్, ఆర్ అండ్ డీ వంటి సంస్థల విస్తరణ ప్రత్యక్షంగా చూస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్నింగ్ వంటి సంస్థలు తెలంగాణను విడిచి పోతున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కార్నింగ్ సంస్థలతో చర్చలు జరిపామని వారు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో అమెజాన్ లాంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం..

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

Crime News: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ..

Updated Date - Aug 17 , 2024 | 07:25 PM