Sridharbabu: పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం..
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:44 PM
Telangana: ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక అయిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్‌ఐసీపీలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27: ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు (Biao Asia 2024) హైదరాబాద్ వేదిక అయిందని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. హెచ్‌ఐసీపీలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. పారిశ్రామికవేతలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకోస్తామని చెప్పారు. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీ రూపొందిస్తామన్నారు. రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చెలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించేలా తగిన శిక్షణ ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...