TG News: మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు
ABN , Publish Date - Mar 15 , 2024 | 10:08 AM
Telangana: సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఇల్లిగల్ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో మధుసూదన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు కి తరలించే అవకాశం ఉంది.
సంగారెడ్డి, మార్చి 15: సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఇల్లిగల్ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో మధుసూదన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు కి తరలించే అవకాశం ఉంది. మధుసూదన్ రెడ్డి సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. మధుసూదన్ రెడ్డి అరెస్ట్‌తో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.
ఇవి కూడా చదవండి..
Crime: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
PM Modi: నేడు కన్నియాకుమారికి మోదీ.. భారీ భద్రతా ఏర్పాట్లు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..