Bandi Sanjay: 350కు పైగా ఎంపీ సీట్లను బీజేపీ గెలవబోతోంది
ABN , Publish Date - Feb 02 , 2024 | 09:52 PM
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కు పైగా ఎంపీ సీట్లను గెలవబోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) అన్నారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కు పైగా ఎంపీ సీట్లను గెలవబోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసిందన్నారు. రైతుబంధు 15వేలు ఇస్తారా? ఇవ్వరా? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కాదు.. తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ ప్రధాని మోదీ అని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. ఆదాయం లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంద రోజులు.. ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వం గ్యారంటీలను తప్పించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అలా చేస్తే కాలం ప్రభుత్వాన్ని ప్రజలు తప్పిస్తారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం కల్ల అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
బండి సంజయ్, ఈటల మధ్య సయోధ్య
ఎంపీ బండి సంజయ్, మాజీమంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఈటల, బండి సంజయ్ ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య చంద్రశేఖర్ తివారీ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో విభేదాలను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.