Share News

Trafic Rules: ఈ రాత్రికి ఈ రూట్‌లో వెళ్తున్నారా.. మీకు దబిడి దిబిడే..

ABN , Publish Date - Dec 31 , 2024 | 09:46 AM

ప్రజలంతా 2024కు వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట వేల సంఖ్యలో ఈవెంట్లను హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పొరపాటున ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..

Trafic Rules: ఈ రాత్రికి ఈ రూట్‌లో వెళ్తున్నారా.. మీకు దబిడి దిబిడే..
Traffic Rules

ప్రజలంతా 2024కు వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట వేల సంఖ్యలో ఈవెంట్లను హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేస్తున్నారు. నగరంలోని న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రధాన రూట్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అడిషనల్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ మంగళవారం రాత్రికి సంబంధించిన ట్రాఫిక్ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతి ఉండదని పేర్కొన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహన రాకపోకలపై అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తామన్నారు. భద్రత దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. నాగోల్ ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్, ఎల్‌బీనగర్ ఎక్స్ రోడ్‌లోని మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌లు బైరామల్ గూడ ఎక్స్‌రోడ్డులోని మొదటి, రెండో లెవల్ ఫ్లైఓవర్‌లు ఎల్‌బీ నగర్ అండర్ పాస్, చింతలకుంట అండర్‌పాస్‌ల మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ద్విచక్ర వాహనాలు, మోటారు వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండబోదన్నారు. బేగంపేట, టోలిచౌకి మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను ఈరోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మూసివేస్తామని అడిషనల్ ట్రాఫిక్ పోలీసు కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నారు.


ఆ రూట్లలో వెళ్తే దబిడి దిబిడే..

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సిటీలోని ప్రధాన మార్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఎవరైనా డ్రంక్ డ్రైవ్‌లో దొరికితే వదిలిపెట్టేది లేదన్నారు. కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రాణాలు పోతున్నాయని, ఈ క్రమంలో సిటీలో మంగళవారం రాత్రి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. మద్యం తాగిన వ్యక్తులు తమ సొంత వాహనాలకు డ్రైవర్‌ను పెట్టుకోవడం లేదా క్యాబ్ సర్వీసులను ఉపయోగించడం ఉత్తమమని పోలీసులు సూచించారు.


దొరికారా అంతే..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే వెహికల్ సీజ్ చేయడంతో పాటు వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైతే పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరై.. కోర్టులో హాజరై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Dec 31 , 2024 | 09:46 AM