Share News

TS News: నిమ్స్ అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

ABN , Publish Date - Jul 06 , 2024 | 10:01 AM

Telangana: నిమ్స్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఇంట్లో వైద్యురాలు సూసైడ్ చేసుకుంది. డాక్టర్ ప్రాచీకార్ అధిక మోతాదులో అనస్తీషియా తీసుకున్నారు.

TS News: నిమ్స్ అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ఆత్మహత్య
Nims Hospital

హైదరాబాద్, జూలై 6: నిమ్స్‌ ఆస్పత్రిలో (Nims Hospital) విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని ఇంట్లో వైద్యురాలు సూసైడ్ చేసుకుంది. డాక్టర్ ప్రాచీకార్ అధిక మోతాదులో అనస్తీషియా తీసుకున్నారు. దీన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం డాక్టర్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Dwarampudi Chandrasekhar Reddy: అవినీతి ‘ద్వారం’ బద్ధలు!


కాగా.. ప్రాచీకార్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వైద్యురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డు మూసివేత..

బాబు వచ్చినా ‘మారలేదు’!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 10:13 AM