Share News

Pawan Kalyan: జలవనరుల సంరక్షణపై రేవంత్ రెడ్డికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి..

ABN , Publish Date - Sep 11 , 2024 | 08:17 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచనా విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని పవన్ కొనియాడారు.

Pawan Kalyan: జలవనరుల సంరక్షణపై రేవంత్ రెడ్డికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి..
Pawan Kalyan Met CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచనా విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని పవన్ కొనియాడారు. ఇటీవల ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి చొప్పున ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) ఉదయం వరద బాధితుల సహాయార్థం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు.


అనంతరం వారి భేటీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద అందజేసినట్లు చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి అప్యాయంగా స్వాగతించారని, ప్రజల కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఈ మేరకు వారు భేటీ అయిన ఫొటోలను ట్వీట్‌కు జత చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Deputy CM Bhatti: 2025మార్చికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి..

September 17th: జాతీయ జెండాల ఆవిష్కరణ

Padi Kaushik Reddy: ఉప ఎన్నికలు వస్తాయని ఆ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు..

Updated Date - Sep 11 , 2024 | 08:26 PM