Share News

TG NEWS: సినిమాను తలపించేలా బోరబండ ఆటో డ్రైవర్ హత్య కేసు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:36 AM

సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశారు. కూతురిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్‌కి బాలిక తల్లిదండ్రులు స్కెచ్ వేశారు. స్నాప్ చాట్ ద్వారా భార్యతో కలిసి హనీ ట్రాప్ చేశారు. ఆటో డ్రైవర్ కుమార్‌ను రహస్య ప్రదేశానికి బాలిక తల్లి పిలిచింది.భర్తతో కలిసి ఆటో డ్రైవర్ హత్యకు పాల్పడ్డారు.

TG NEWS: సినిమాను తలపించేలా బోరబండ ఆటో డ్రైవర్ హత్య కేసు

హైదరాబాద్‌: తన కూతరును కిడ్నాప్ చేశారనే కారణంతో ఓ ఆటో డ్రైవర్‌పై తల్లిదండ్రులు పగ పెంచుకున్నారు. వారు అనుకున్నదే తడవుగా పక్క ప్లాన్ చేసి ఆ ఆటో డ్రైవర్‌‌ను అంతమొందించారు. ఈ ఘటన ఏడాదిన్నర తర్వాత వెలుగుచూసింది. ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. 2023 మార్చి నెలలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్ కనపడటం లేదని అతని బంధువులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే సినిమాను తలపించేలా ఆటో డ్రైవర్ హత్య కేసు ఉంది. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి ఈ ఘటన వచ్చింది.


వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశారు. కూతురిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్‌కి బాలిక తల్లిదండ్రులు స్కెచ్ వేశారు. స్నాప్ చాట్ ద్వారా భార్యతో కలిసి హనీ ట్రాప్ చేశారు. ఆటో డ్రైవర్ కుమార్‌ను రహస్య ప్రదేశానికి బాలిక తల్లి పిలిచింది.భర్తతో కలిసి ఆటో డ్రైవర్ హత్యకు పాల్పడ్డారు. బండరాయితో కాళ్లు చేతులు కట్టిపడేసి నాగార్జునసాగర్ ఎడమ కాలువలో విసిరేసి తల్లిదండ్రులు వెళ్లారు. కోదాడ పీఎస్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. 2023 మార్చి నెలలో జూబ్లీహిల్స్ పీఎస్‌లో మిస్సింగ్ కేస్‌గా నమోదైంది. అనంతరం బోరబండకు బదిలీ చేశారు. ఆటో బంపర్‌ను గుర్తుపట్టిన మృతుడి బంధువులు నిందితులను పట్టుకున్నారు. ఈ హత్య కేసు వెలుగు చూడటంతో తల్లిదండ్రులను బోరబండ పోలీసులు అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Allu Arjun: అల్లు అర్జున్‌‌ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం

CM Revanth Reddy: మానవత్వం లేదా ?

Child Custody: పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్‌ రెడ్డి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 22 , 2024 | 11:36 AM