TS News: 7.3 టన్నుల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
ABN , Publish Date - Jul 12 , 2024 | 11:20 AM
Telangana: సమాజంలో రోజు రోజుకూ నకిలీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. ఆహార పదార్థాలను నకిలీ చేసి అమ్ముతున్న వారిపై పోలీసులు, ఫుడ్ స్టేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట నకిలీలు తయారవుతూనే ఉన్నాయి.
హైదరాబాద్, జూలై 12: సమాజంలో రోజు రోజుకూ నకిలీ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. ఆహార పదార్థాలను నకిలీ చేసి అమ్ముతున్న వారిపై పోలీసులు, ఫుడ్ స్టేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట నకిలీలు తయారవుతూనే ఉన్నాయి. నకిలీ ఉత్పత్తుల తయారీపై అధికారులు కొరడా ఝుళిపించినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు తయరీదారులు. ఎంతో రహస్యంగా నకీలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కట్‌లోకి విడుదల చేస్తున్నారు.
CM Revanth: 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ.. ఎజెండా అంశాలు ఇవే
తాజాగా... బుద్వేల్‌లోని గ్రీన్ సిటీలో గోప్యంగా తయారు చేస్తున్న నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. దాదాపు రూ.15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్ నిజాన్ అనే వ్యక్తి... అప్న ఎంటర్ప్రైసెస్ పేరుతో ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎస్వోటీ పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ వాడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Arvind Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు బెయిల్
Congress: గ్రేటర్‌లో గులాబీ పార్టీకి బిగ్ షాక్.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్?
Read Latest Telangana News And Telugu News