Landslides: కొండచరియలు విరిగిపడి, నదిలో పడ్డ 2 బస్సులు.. 63 మంది గల్లంతు
ABN , Publish Date - Jul 12 , 2024 | 10:13 AM
ప్రతికూల వాతావరణం నేపాల్(nepal) ప్రజలకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే నేడు ఉదయం మధ్య నేపాల్‌లోని మదన్ ఆషిర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో(Landslide Sweeps) అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న రెండు బస్సులు(buses) బోల్తా కొట్టి త్రిశూలి నది(Trishuli River)లో పడిపోయాయి.
ప్రతికూల వాతావరణం నేపాల్(nepal) ప్రజలకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే నేడు ఉదయం మధ్య నేపాల్‌లోని మదన్ ఆషిర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో(Landslide Sweeps) అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న రెండు బస్సులు(buses) బోల్తా కొట్టి త్రిశూలి నది(Trishuli River)లో పడిపోయాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 63 మంది తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు చిత్వాన్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు.
తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్రమాదం(accident) జరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకుని వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తప్పిపోయిన బస్సులను వెతకడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇదే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఖాట్మండు నుంచి భరత్‌పూర్, చిత్వాన్‌కు వెళ్లాల్సిన అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి.
ఇదిలా ఉండగా నారాయణగఢ్-ముగ్లిన్ రోడ్ సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో(landslide) దాదాపు ఐదు డజన్ల మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పెద్ద ఎత్తున ఆస్తులకు నష్టం వాటిల్లిందని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాలపై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రయాణీకులను శోధించి, రక్షించాలని హోం అడ్మినిస్ట్రేషన్‌తో సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి:
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..
Read Latest International News and Telugu News