Share News

New Year Celebration: న్యూ ఇయిర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

ABN , Publish Date - Dec 13 , 2024 | 01:49 PM

నూతన సంవత్సన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. పార్టీల కోసం యువత వివిధ ప్లాన్లు వేసుకుంటున్నారు. కాగా.. ఈ వేడుకలకి సంబంధించి పలు ఆంక్షలు విధించారు.

New Year Celebration: న్యూ ఇయిర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో న్యూ ఇయిర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి, అశ్లీల నృత్యాలు నిషేధించినట్లు తెలిపారు. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు..పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6నెలలు జైలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్‌ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు నమోదు చేస్తామని అన్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌పై వెహికల్‌ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు అన్నారు. నూతన సంవత్సన వేడుకలకు ( New Year Celebrations ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. పార్టీల కోసం యువత వివిధ ప్లాన్లు వేసుకుంటున్నారు. కాగా.. ఈ వేడుకలకు సంబంధించి పలు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకలను రాత్రి 12:30 గంటల్లోపుముగించాలి. ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలి. ఈవెంట్స్‌లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలి. ఈవెంట్స్‌లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. 45 డెసిబుల్స్ శబ్ధం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దు. కెపాసిటికి మించి పాసులు ఇవ్వొద్దు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు. లిక్కర్ ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు అని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు.

నయా జోష్‌తో న్యూ ఇయిర్‌


నయా జోష్‌తో న్యూ ఇయిర్‌

కొంత సంతోషం.. మరికొంత దుఃఖం వంటి జ్ఞాపకాలు మిగిల్చి 2024 మరికొన్ని రోజుల్లోనే వెళ్లిపోనుంది. నయా జోష్‌తో న్యూ ఇయిర్‌ 2025 ఆవిష్కృతం కానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి వయో భేదం లేకుండా ప్రజలు సిద్ధమవుతున్నారు. మరోవైపు న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆంక్షలు ఉండటంతో యువత కుటుంబసభ్యులతో కలిసి ఇళ్లలోనే వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కొన్ని కుటుంబాలు కలిసి కొత్త వేడుకలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది యువకులు కొత్త సంవత్సరం వేడుకలకు బెంగుళూరు, గోవా, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.


వేడుకలపై పోలీసుల నజర్‌

హైదరాబాద్‌‌లోని శివారు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతలపై పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. యువకులు మద్యం తాగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉండటంతో ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31 రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.

పోలీసుల నిబంధనలు

  • మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయనున్నారు.

  • మైనర్‌లకు బైక్‌లు ఇవ్వడంతో ప్రమాదాలు జరగవచ్చు. తల్లిదండ్రులు మైనర్‌లకు బైక్‌లు ఇవ్వవద్దు. పోలీసులకు పట్టుబడితే కేసులు నమోదు చేస్తారు.

  • అతి వేగంగా వాహనాలు నడిపితే జరిమానాతోపాటు చర్యలు ఉంటాయి.

  • భారీ శబ్ధాలు చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడపొద్దు.

  • గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీ వంటివి చేపట్టవద్దు.

  • రోడ్లపై బాణాసంచా కాల్చవద్దు. మైక్‌లు ఎక్కువ సౌండ్‌ పెట్టి ఇబ్బంది పెట్టవద్దు.

  • డీజేలపై నిషేధం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వాడితే సీజ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

  • రాత్రి వేళల్లో ట్రిఫుల్‌ రైడింగ్‌, సైలెన్సర్‌లను తీసివేసి వాహనాలను నడుపుతూ శబ్ధకాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్‌ చేస్తారు.

  • బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధం. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే పోలీస్‌ చర్యలు ఉంటాయి.


ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలి

ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకునేలా సూచనలు చేశాం. వేడుకల సందర్భంగా పెట్రోలింగ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌లు ముమ్మరంగా నిర్వహించనున్నాం. ప్రజలు అర్ధరాత్రి 12.30 గంటల్లోపు వేడుకలు ముగించుకోవాలని హైదరాబాద్ నగర పోలీసులు సూచించారు.


Also Read:

ఆ అవార్డుల జాబితాలో హైదరాబాద్ బిర్యానికి చివరి స్థానం

మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

తగ్గేదేలే అంటున్న పసిడి

మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 13 , 2024 | 01:59 PM