TS News: హీటెక్కుతున్న తెలంగాణ పాలిటిక్స్.. తారాస్థాయికి ప్రాజెక్ట్స్ ఫైట్
ABN , Publish Date - Feb 10 , 2024 | 11:42 AM
తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ప్రాజెక్ట్స్ ఫైట్ తారాస్థాయికి చేరింది. ఈ నెల 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్టుల అప్పగింతపై 13న నల్గొండలో బీఆర్ఎస్ నిరసన సభ నిర్వహించనుంది.
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ప్రాజెక్ట్స్ ఫైట్ తారాస్థాయికి చేరింది. ఈ నెల 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్టుల అప్పగింతపై 13న నల్గొండలో బీఆర్ఎస్ నిరసన సభ నిర్వహించనుంది. అదే రోజు కాలేశ్వరం నిర్మాణ లోపంపై ప్రభుత్వం చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా విపక్ష, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానం పలికాయి. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ అప్పగించడం జరిగింది. ఓ వైపు చలో నల్గొండ, మరోవైపు చలో మేడిగడ్డ కార్యక్రమాలతో రాజకీయం వేడెక్కుతోంది.