Share News

Rajendranagar PS: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు అరుదైన ఘనత

ABN , Publish Date - Jan 02 , 2024 | 02:52 PM

Telangana: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు అరుదైన ఘనత లభించింది. దేశంలోనే నంబర్ వన్ ఠాణాగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ నిలిచింది. పలు అంశాలను ప్రమాణికంగా తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వక శాఖ ఎంహెచ్‌ఏ నిర్వహించిన అధ్యయనం సర్వేలో సింహబాగు కేటగిరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజేంద్రనగర్ పోలీసులు ఈ అరుదైన ఘనతను సాధించారు.

Rajendranagar PS: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు అరుదైన ఘనత

రంగారెడ్డి, జనవరి 2: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు (Rajendranagar Police Station) అరుదైన ఘనత లభించింది. దేశంలోనే నంబర్ వన్ ఠాణాగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ నిలిచింది. పలు అంశాలను ప్రమాణికంగా తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వక శాఖ ఎంహెచ్‌ఏ (MHA) నిర్వహించిన అధ్యయనం సర్వేలో సింహబాగు కేటగిరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజేంద్రనగర్ పోలీసులు ఈ అరుదైన ఘనతను సాధించారు. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్‌కు ఈ మేరకు ఎంహెచ్‌ఏ నుంచి సందేశం అందింది. ఈనెల 5న జయపూర్‌లో జరుగనున్న డీజీపీల కాన్ఫరెన్స్‌లో అవార్డును అందుకోవాల్సిందిగా ఎంహెచ్‌ఏ నుంచి పిలువు వచ్చిందని అధికారులు తెలిపారు.


శాంతి భద్రతల పరిరక్షణ కేసుల పరిష్కరణ, పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలో రాజేంద్రనగర్ ఠాణా మంచి మార్కులను కొట్టేయగా.. మహిళ భద్రతలో టాప్‌గా నిలిచింది. ఇక మిస్సింగ్ కేసులను త్వరితగతిన ట్రెస్ చేయడం, భార్యాభర్తల మధ్య వివాదాలను కౌన్సిలింగ్‌లతో ఠాణా స్థాయిలోనే పరిష్కరించడం వంటి అంశాల్లోనూ మంచి మార్కులు సాధించింది. వీటితో పాటుగా గుర్తుతెలియని వ్యక్తులు మరణించినప్పుడు వారి మృతదేహాలు దొరికినప్పుడు వెనువెంటనే వారు ఎవరనేదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడం.. పోస్టుమార్టం జరిగిన వెంటనే మృతదేహాన్ని అప్పగించడంపై రాజేంద్రనగర్ పోలీసుల పనితీరును ఎంహెచ్‌ఏ ప్రత్యేకంగా అభినందించింది.

Updated Date - Jan 02 , 2024 | 02:52 PM