Hyderabad Metro: హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. మెట్రో స్టేషన్లలో ఇదీ పరిస్థితి..!
ABN , Publish Date - May 07 , 2024 | 07:36 PM
ఒకే ఒక వర్షం.. హైదరాబాద్‌ను(Hyderabad) అతలా కుతలం చేసింది. అసలే ఉద్యోగుల పని వేళలు ముగిసి ఇంటికి బయలుదేరే సమయం. ఈ సమయంలో భారీ వర్షం(Heavy Rains) భాగ్యనగరాన్ని ముంచెత్తింది. రోడ్లపై చేరిన వర్షపు నీటితో రవాణా వ్యవస్థ(Public Transport) స్తంభించిపోయింది.
హైదరాబాద్, మే 07: ఒకే ఒక వర్షం.. హైదరాబాద్‌ను(Hyderabad) అతలా కుతలం చేసింది. అసలే ఉద్యోగుల పని వేళలు ముగిసి ఇంటికి బయలుదేరే సమయం. ఈ సమయంలో భారీ వర్షం(Heavy Rains) భాగ్యనగరాన్ని ముంచెత్తింది. రోడ్లపై చేరిన వర్షపు నీటితో రవాణా వ్యవస్థ(Public Transport) స్తంభించిపోయింది. భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షానికి తోడు.. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగ్స్ కూలిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు, హోర్డింగ్స్ కూలి వాహనాలపై పడ్డాయి. దీంతో నగరంలో అక్కడా ఇక్కడా అనే తేడాలేమీ లేకుండా అన్ని చోట్లా రెడ్ అలర్ట్ తలపించేలా పరిస్థితి నెలకొంది. ఇక ప్రజా రావాణా వ్యవస్థలో ప్రాయాణించే ప్రయాణికులు.. చాలా మంది మెట్రో ట్రైన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. మెట్రోలో వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా మెట్రో స్టేషన్లకు వెళ్తున్నారు. చాలా మెట్రో స్టేషన్లలో జనాలు పోటెత్తారు.
కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇవే..
హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమస్యలు ఉన్నవారు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రకటించారు. 040-21111111, 9000113667 నెంబర్లకు కాల్ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చంటూ అధికారులు ప్రకటించారు. మరోవైపు డీఆర్ఎస్ సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. వర్షం పరిస్థితులపై సమీక్షించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్. రోడ్లపై నిలిచిపోయిన నీటిని, విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులందరూ తమ తమ ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించాలని కమిషనర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు వచ్చే సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలని.. వాటిని వెంటనే పరిష్కరింపజేయాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్‌కు పోటెత్తిన ఫిర్యాదులు..
జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. నగర వ్యాప్తంగా 74 ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
భారీగా వర్షం..
హైదరాబాద్‌లో రెండు గంటలుగా వర్షం కురుస్తోంది. అత్యధికంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూసాపేట్ లో 7 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 4 సెంటీమీటర్లు, చందానగర్, ఆర్సిపురంలో 3.7 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్ లో 3.5 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 3.1 సెంటీమీటర్లు, మియాపూర్ లో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.