Share News

Bathukamma: బతుకమ్మ వేడుకలకు ఆ ప్రాంతం ముస్తాబు

ABN , Publish Date - Oct 10 , 2024 | 10:54 AM

Telangana: సద్దుల బతుకమ్మ కోసం ఊరూవాడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది.

Bathukamma: బతుకమ్మ వేడుకలకు ఆ ప్రాంతం ముస్తాబు
Bathukamma

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో బతుకమ్మ (Bathukamma) వేడుకలు అంటరాన్నంటుతున్నాయి. ఈరోజుతో బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకోనున్నారు మహిళలు. సద్దుల బతుకమ్మ కోసం ఊరూవాడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది.

Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..


ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై లేజర్, క్రాకర్స్ షోను నిర్వహించనున్నారు. దాదాపు10 వేల మంది మహిళలతో భారీ ర్యాలీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు మహిళలు. అయితే సీఎం సహా ప్రముఖులు బతుకమ్మ వేడుకలకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

KCR: రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం


ట్రాఫిక్ ఆంక్షలు ఇవే...

అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకురానున్నారు. అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లోని చిల్డ్రన్‌ పార్కు వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్‌ మీదుగా ఎంజీబీఎస్‌ వైపు జిల్లా ఆర్టీసీ బస్సులను ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు. ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు. రాణిగంజ్ నుంచి పీవీఎన్‌ఆర్ మార్గ్(నెక్లెస్ రోడ్) వైపు వచ్చే వాహనదారులను నల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద మినిస్టర్ రోడ్ వైపునకు మళ్లిస్తారు. మినిస్టర్ రోడ్ నుంచి పీవీఎన్‌ఆర్ మార్గ్(నెక్లెస్ రోడ్) వైపు వచ్చే వారిని నల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.


లిబర్టీ నుంచి ఎగువ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపునకు మళ్లిస్తారు. ధోబీ ఘాట్ నుంచి చిల్డ్రన్స్ పార్క్/అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వారిని డీబీఆర్ మిల్స్ వద్ద కవాడిగూడ క్రాస్ రోడ్ వైపునకు పంపిస్తారు. డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే ప్రయాణికులను కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద జబ్బార్ కాంప్లెక్స్, సీజీవో టవర్స్ వైపు మళ్లించనున్నారు. సెయిలింగ్ క్లబ్ వైపు వెళ్లాలనుకునే సీజీవో టవర్స్ నుంచి వచ్చే వాహనదారులను కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద డీబీఆర్ మిల్స్, జబ్బార్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు.


అలాగే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్ బండ్‌కు వాహనాల్లో వచ్చే ప్రజలకు పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ మార్గ్‌లోని రేస్ కోర్స్ రోడ్డు, జీహెచ్ఎంసీ కార్యాలయం- బీఆర్కే భవన్ మధ్య రహదారి, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్‌పై పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ట్యాంక్ బండ్‌పై జరిగే వేడుకలకు వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలని నగర ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

Tata Shares: రతన్ టాటా మృతి.. ఈ కంపెనీల షేర్లు తగ్గాయా, పెరిగాయా..

Deputy CM: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 10 , 2024 | 06:33 PM