Satyavathi Rathod: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుంది
ABN , Publish Date - Jan 11 , 2024 | 08:10 PM
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavathi Rathod ) అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ హద్దుల్లేని హామీలు ఇచ్చింది. పార్లమెంట్ సమీక్షలో పార్టీ నిర్మాణంపై చర్చ జరిగిందని సత్యవతి రాథోడ్ తెలిపారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavathi Rathod ) అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ హద్దుల్లేని హామీలు ఇచ్చింది. పార్లమెంట్ సమీక్షలో పార్టీ నిర్మాణంపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. 2014 లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలిచామని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యే స్థానాలను, ఎంపీ స్థానాన్ని గెలిచామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో భద్రాచలంలో మాత్రమే గెలిచామన్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామని తెలిపారు. ప్రజలు అడిగిన, అడగని పథకాలు ఇచ్చామన్నారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అవుతోందన్నారు. 1989లో ఎన్టీఆర్ ఓడిపోయిన ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. కేసీఆర్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని సత్యవతి రాథోడ్ ఎద్దేవా చేశారు.