Share News

CM Revanth Reddy: మూసీ నిర్వాసితులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 06 , 2024 | 06:00 PM

మూసీ పరివాహక ప్రాంతంలో మెుత్తం 10వేల కుటుంబాలు ఉన్నాయని, ఆరు నెలల నుంచి ఎన్యుమరేట్ చేయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 33టీమ్‌లను పెట్టి ఇంటింటికీ తిప్పి ప్రతి ఒక్కరి వివరాలను సేకరించినట్లు ఆయన వెల్లడించారు.

CM Revanth Reddy: మూసీ నిర్వాసితులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
CM Revanth Reddy

హైదరాబాద్: మూసీ(Musi) విషయంలో ఎవరూ అడ్డుపడ్డా ప్రక్షాళన చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మూసీని అభివృద్ధి చేయెుద్దని ప్రతిపక్షాలు అంటున్నాయని, ఎందుకు చేయెుద్దో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ పరివాహక ప్రజలు ఆ మురికి ప్రాంతంలో పుట్టి అక్కడే ఉంటున్నారని, వారి భౌవిష్యత్తు తరాలూ అలాగే బతకాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


మూసీ ప్రాంత ప్రజలకు మంచి జీవితం ఉండొద్దా?, వాళ్ల పిల్లలు చదువుకోవద్దా?, వాళ్లు బాగుపడొద్దా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లందరినీ బాగు చేసే మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో మెుత్తం 10వేల కుటుంబాలు ఉన్నాయని, ఆరు నెలల నుంచి ఎన్యుమరేట్ చేయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 33టీమ్‌లను పెట్టి ఇంటింటికీ తిప్పి ప్రతి ఒక్కరి వివరాలను సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అవేర్‌నెస్ ప్రొగ్రామ్‌లో భాగంగా మార్కింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఎంత వరకూ బఫర్ జోన్‌ ఉందనేది వివరిస్తున్నామని, నష్టపోయే వారికి పరిహారం ఇవ్వనున్నట్లు నిర్వాసితులకు చెప్తున్నట్లు రేవంత్ తెలిపారు. మూసీలో గుడిసెలు వేసుకున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. బఫర్ జోన్‌లో ఉన్న వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ABN: సాక్షి పాడు బుద్ధి.. ఆధారాలతో బట్టబయలు..

KTR: ఓవైపు సాగునీటి సంక్షోభం.. మరోవైపు రుణమాఫీ ద్రోహం..

Updated Date - Oct 06 , 2024 | 06:13 PM