TG Govt: గత ప్రభుత్వం ఇచ్చిన టెండర్‌పై సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:46 PM
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ బుధవారం జీవో జారీ అయ్యింది. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 6: గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ టెండర్ల విషయంలో సర్కార్ (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో ఇచ్చిన కేశవాపురం కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల పేరిట గత ప్రభుత్వం ప్రాజెక్టును డిజైన్ చేసిన విషయం తెలిసిందే. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్.. అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
US Election Results: అమెరికా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే 7 స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలు ఇవే
కొత్త ప్రతిపాదనలు
అదే ఖర్చుతో గోదావరి ఫేజ్ 2 స్కీమ్‌ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆరేళ్లు అయినా...
పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవాపురం చెరువును నింపుతారు. కేశవాపురం చెరువును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌గా నిర్మించనున్నారు. అక్కడి నుంచి ఘన్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీటి అవసరాలకు సరఫరా చేసేలా ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే ఆరేండ్లై పనులు ప్రారంభంకానీ పరిస్థితి. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదని రేవంత్ సర్కార్ చెబుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఈ టెండర్లను మెఘా కంపెనీ దక్కించుకుంది. అయితే టెండర్లను దర్కించుకున్నప్పటికీ పనులు చేపట్టకుండా మేఘా కంపెనీ వదిలేసింది.
ఫలితాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
టెండర్లు రద్దు చేస్తూ...
2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని.. 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మెఘా కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటి వరకు పనులు చేపట్టని కారణంగా మెఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి తాగునీటి సరఫరాతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటిని నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
Hyderabad: గోల్డ్ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..
Read Latest Telangana News And Telugu News