Share News

TGPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్.. కీలక తీర్పు..

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:56 PM

Telangana Group 1 Aspirants: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.

TGPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్.. కీలక తీర్పు..
TGPSC

Telangana Group 1 Exam: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్ - 1 అభ్యర్థుల రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్షాలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఆంక్షలు విధించారు అధికారులు. బీఎన్ఎస్ఎస్ 163 యాక్ట్ ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద ఐదుగురికన్నా ఎక్కువ మంది గుమికూడరాదని హెచ్చరించారు.


సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..

ఇదిలాఉంటే.. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని విద్యార్థులు చెప్పారు. సోమవారం రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటిస్తూ విచారణను వాయిదా వేశారు. జీవో 55నే అమలు చేయాలని విద్యార్థులంతా కోరినా.. సీఎం పెడచెవిన పెట్టారని గ్రూప్ 1 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టుతో మొట్టికాయలు కొట్టించుకోక ముందే ప్రభుత్వం దిగివచ్చి జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా గురించి మాట్లాడుతున్న సీఎం.. జీవో 29 వల్ల నష్టపోయే విద్యా్ర్థుల గురించి ఎందుకు స్పందించడం లేదని గ్రూప్ 1 అభ్యర్థులు నిలదీస్తున్నారు.


పోలీసులతో దాడులు..

హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఇప్పటికే పోలీసులు దాడులు చేస్తున్నారని గ్రూప్ 1 అభ్యర్థులు వాపోయారు. గ్రూప్ 1 చదివే విద్యార్థులపై దాడులు చేస్తూ.. పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ 2.0 ఉద్యమాన్ని మళ్లీ చూస్తారంటూ రేవంత్ సర్కార్‌ను విద్యార్థులు హెచ్చరించారు. జీవో 29 గ్రూప్ 1 విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. సీఎం మొండిగా ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ చెప్తుంటే, రేవంత్ రెడ్డేమో ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో కేసీఆర్ జీవో 55 తెచ్చారని.. గ్రూప్ 1 లో రిజర్వేషన్లు అమలు అయ్యేలా తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 29 తీసుకొచ్చారని.. దీని వల్ల గ్రూప్ 1 అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందనే ఆశాభావం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వికీపీడియాలో సోర్స్ తీసుకున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వికీపీడియాను ఎలా నమ్ముతారు? అని గ్రూప్ 1 అభ్యర్థులు ప్రశ్నించారు.


Also Read:

రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు

'ఆప్' మాజీ మంత్రికి బెయిల్

మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ బైక్.. ఫీచర్లు తెలిస్తే

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 18 , 2024 | 05:14 PM