TS Assembly: ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం.. సభ వాయిదా
ABN , Publish Date - Jul 31 , 2024 | 05:08 PM
Telangana: ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ రేపటి(గురువారం)కి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు.
హైదరాబాద్, జూలై 31: ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ (Telangana Assembly) ఆమోదం తెలిపింది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ రేపటి(గురువారం)కి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ కేటీఆర్ మాట్లాడటం పట్ల మంత్రులు అభ్యంతరం తెలిపారు. ఒకానొక సమయంలో మంత్రులు వర్సెస్ కేటీఆర్ అన్నట్లు సీన్ మారిపోయింది. ఆపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
Good News: ఏపీలో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించిన ప్రభుత్వం
కాగా.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి, సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేయడం సభలో దుమారాన్ని రేపింది. సభలో గందరగోళం నెలకొనడంతో కొద్దిసేపు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సబితకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టగా.. అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో సభలో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. అయితే సభ్యుల ఆందోళనల మధ్యే ద్రవ్యవినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.
సబిత టార్గెట్‌గా...
కాగా.. సభలో పార్టీ మార్పుల అంశంపైనా వాడీవేడీగా చర్చ జరిగింది. సబితా ఇంద్రారెడ్డి టార్గెట్‌గా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ కౌంటర్ల వర్షం కురిపించారు. ఒకానొక సమయంలో సబిత కంటితడి కూడా పెట్టారు. అసలు తనను ఎందుకు టార్గెట్ చేశారంటూ ప్రశ్నించారు. ‘*2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి అనేక పదవులు ఇచ్చింది. కానీ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరి మోసం చేశారు. ఒక దశాబ్ద కాలం సబితకి మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సబిత బీఆర్ఎస్‌లోకి వెళ్ళారు. కాంగ్రెస్ నన్ను సీఎల్పీ లీడర్ చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ మారారు’’ అంటూ భట్టి విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడుతూ...‘‘నువ్వు కాంగ్రెస్‌లోకి వస్తే ముఖ్యమంత్రిని అవుతానని సబితక్క నాకు చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి ఆమె మాత్రం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. నేను చెప్పే మాట నిజమా..? కాదా..? అని సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి’’ అని రేవంత్ గట్టిగానే మాట్లాడారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 3:30 గంటలకు సభ ప్రారంభమైంది.
Jishnudev Varma: నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్
బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన...
సభ తిరిగి ప్రారంభమైన తరువాత.. మాజీ మంత్రి సబితకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళా గవర్నర్‌పై పాడి కౌశిక్ బూతులు మాట్లాడాడు. నన్ను కూడా మొన్న నాలెడ్జ్ లేదని కౌశిక్ అన్నాడు. నాకు క్షమాపణ చెప్పాడా? వాళ్ళకి ఒక రూల్, మాకు ఒక రూల్ ఆ? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ‘‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు మమ్మల్ని అవమానించారు. మా మైక్ కట్ చేసినా వెల్‌లోకి వెళ్ళలేదు’’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘బీఆర్ఎస్ పదేళ్లు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు సభా మర్యాదలు మంటగలుపుతోంది. బీఆర్ఎస్ సభ్యుల తీరు విచారకరం’’ భట్టి అన్నారు. అయితే బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్యే ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
కేటీఆర్ వర్సెస్ సీఎం, మంత్రులు...
అంతకుముందు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ‘‘బడ్జెట్‌లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏది’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందన్నారని.. తెలంగాణ వస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తుందన్నారని అన్నారు. ఏపీ - తెలంగాణలో మత ఘర్షణలు వస్తాయన్నారని, అలాగే తెలంగాణలో నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారని ఆనాటి సంగతులను గుర్తుచేశారు. అంతేకాకుండా తెలంగాణ వారికి పరిపాలన సామర్థ్యం ఉందా? అని కూడా అన్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావని.. ఉన్నవి పోతాయన్నారని తెలిపారు. ‘‘బీఆర్‌ఎస్ పాలన గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు.. గత కాంగ్రెస్ పాలనపై మేమెందుకు మాట్లాడకూడదు’’ అని ప్రశ్నించారు.
Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ఆ ముగ్గురితో సమంగా..
అయితే కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు అడ్డుకోవడంతో.. కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్న విధంగా సభలో సీన్ మారిపోయింది. ఇచ్చిన హామీలు ఒక్కొకటి చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మేము చేయకపోతే ప్రజలే మాకు బుద్ది చెబుతారన్నారు. కొంచెం ఓపికగా ఉండాలని మంత్రి తెలిపారు. ఓపికగా ఉండాల్సింది మంత్రులు అని.. తాము కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సత్యదూరంగా మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ కూడా మాకు పోటీగా హామీలు ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదన్నారు. కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యం అని ప్రజలు నమ్మారన్నారు. మమ్మల్ని గెలిపించారని.. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటూ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చారు.. చేయండి. మూసీని లండన్ చేస్తాం అంటున్నారు.. చేయండి. మూసీ సుందరీకరణను స్వాగతిస్తున్నాము. రూ.16వేల కోట్లతో మేము ప్రతిపాదనలు సిద్దం చేశాం. కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకు ప్రతిపాదన పెరిగిందో డీపీఆర్ సబ్మిట్ చేయాలి..?’ అని అసెంబ్లీ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మాట్లాడిన ప్రతి విషయంపైనా సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజిలో స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
Pawankalyan: పవన్ సారూ.. మీరే దిక్కు!
Hyderabad: దూసుకొచ్చిన ‘ఆర్మీ’ బుల్లెట్.. మహిళ కాలికి గాయం
Read Latest Telangana News And Telugu News