Share News

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

ABN , Publish Date - May 06 , 2024 | 09:08 PM

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం రైతుభరోసా(రైతుబంధు) నిధులు విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం రైతుభరోసా(రైతుబంధు)(Rythu Bharosa) నిధులు విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు నుంచి ఈనెల తొమ్మిదో తేదీ వరకు పూర్తిస్థాయి రైతుభరోసా నిధులను విడుదల చేసే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.


ఈరోజు దాదాపు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు సమాచారం. రైతుభరోసా నిధులు పడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు దఫాలుగా రైతుభరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వేళ రైతుభరోసా నిధులు పడటంతో రాజకీయంగా హాట్ టాపిక్ అయింది.

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలో నిధులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 09:09 PM