Home » TS Politics
నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నది. ఇటీవల నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. చిన్నమొత్తంలో లభించే మాదకద్రవ్యం ప్రస్తుతం కిలోల చొప్పున పట్టుబడుతోంది.
బీఆర్ఎస్ (BRS) నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన హస్తం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ బంపరాఫర్ ఇచ్చింది.
బడాబడా నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోవడం.. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు.
రాచకొండ షీటీమ్స్(Rachakonda Sheteams) సిబ్బంది మహిళలను వేధిస్తున్న పోకిరీల భరతం పడుతున్నారు. గడిచిన 15 రోజుల్లో 76మందిని అదుపులోకి తీసుకున్న షీటీమ్స్ వారిపై కేసులు నమోదు చేశారు. వారిలో 20మంది మైనర్లు కూడా ఉండటం గమనార్హం.
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్ నవీన్ రెడ్డికి763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డి కి 652 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సీటును బీఆర్ఎస్ గెలుపొందింది.
సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Andhra Pradesh) ముగియడంతో.. రాష్ట్రం అంతా ప్రశాంతంగా మారింది. అధికార వైసీపీ ఒకవైపు..
మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంటే భయంతోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతు బంధును మళ్లీ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) అన్నారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పిందని అబ్బద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు విషయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నిజమా భట్టి విక్రమార్క మాటలు నిజమా అని ప్రశ్నించారు.
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం రైతుభరోసా(రైతుబంధు) నిధులు విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో(Telangana) రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా 6 గ్యారెంటీల విషయంలో కేటీఆర్‌పై(KTR) సీఎం రేవంత్(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేయగా..