Share News

Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:40 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నామంటూ ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎమ్మెల్యేని బెదిరించి పార్టీలో చేర్చుకున్నామో ఆధారాలతో సహా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్
Vemulawada MLA Adi Srinivas

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నామంటూ ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎమ్మెల్యేని బెదిరించి పార్టీలో చేర్చుకున్నామో ఆధారాలతో సహా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. 2014 నుంచి 60మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా బెదిరించి, ఎన్ని పైసలు ఇచ్చి మీ పార్టీలోకి తీసుకున్నారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.." ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ ఆవేదన చూస్తే జాలి వేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో గవర్నర్, రేవంత్, సీతక్క, కోమటిరెడ్డి లాంటి వాళ్లకి ప్రోటోకాల్ ఇవ్వనప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు. ప్రజలు కుర్చీ పీకేస్తే గానీ రాజ్యాంగం, హక్కులు గుర్తుకు రాలేదు. బీఏసీ సమావేశానికి ప్రతిపక్షాన్ని పిలవనప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా?. తెలంగాణలో మీ పార్టీ జీరో ఎందుకు అయ్యిందో కేటీఆర్ సమాధానం చెప్పాలి. ముందుగా పార్టీల ఫిరాయింపులకు పాల్పడింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మా పార్టీలో చేరిన 10మంది ఎమ్మెల్యేలు వారి ఇష్టప్రకారమే వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకూ రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది. 30లక్షల కుటుంబాలకు రూ.31వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తాం. పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలను ఇబ్బందులకు గురిచేసిన పాపం బీఆర్ఎస్ పార్టీదే" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..

Prashantreddy: విద్యుత్ కమిషన్ చైర్మన్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం

Updated Date - Jul 16 , 2024 | 03:41 PM