Mahesh kumar: ప్రతీ హామీ అమలు చేసి తీరతాం
ABN , Publish Date - Sep 09 , 2024 | 01:26 PM
Telangana: ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడున్నర లక్షల కోట్ల అప్పు పెట్టి తమ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి పోయాడు కేసీఆర్ అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ (TPCC Chief Mahesh kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడున్నర లక్షల కోట్ల అప్పు పెట్టి తమ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి పోయాడు కేసీఆర్ అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.
Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ‘‘నాయకులకు.. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు.. ప్రభుత్వం మనదే మరింతగా కష్టపడి పని చేయండి’’ అంటూ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్నారు. ప్రభుత్వాన్ని.. పార్టీని.. సమన్వయం చేసుకుంటూ ముందు వెళ్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వెల్లడించారు.
Anitha: వర్షాలపై మొబైళ్లకు అలెర్ట్ సందేశాలు పంపండి... హోంమంత్రి ఆర్డర్స్
కాగా... సోమవారం ఉదయం కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంటికి టీపీసీసీ చీఫ్ వెళ్లారు. ఖమ్మం వరద బాధితులకు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వ్యాన్‌లను టీపీసీసీ చీఫ్ జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను మైనంపల్లి పంపిణీ చేయనున్నారు. 50లక్షల రూపాయల విలువ చేసే సరుకులను ఖమ్మంకు పంపించారు. ఈ క్రమంలో మైనంపల్లి నివాసంలో జెండా ఊపి సరుకుల వ్యాన్‌లను మహేష్ కుమార్ ఖమ్మంకు పంపారు. 25 కేజీల బియ్యం బ్యాగ్‌తో పాటు 11 రకాల సరుకులను వెయ్యి కుటుంబాలకు పంపిణీ చేయనన్నారు.
ఇవి కూడా చదవండి...
TG Highcourt: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టు తీర్పు
TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి
Read LatestTelangana NewsAndTelugu News