Share News

TG NEWS: మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:15 PM

Madapur: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదపూర్‌లోని 100 ఫీట్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతిచెందారు. యువకుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

TG NEWS: మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Road Accident

హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఇవాళ(శుక్రవారం) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆకాంక్ష్(24) అతని స్నేహితుడు రఘుబాబుతో కలిసి బోరబండ నుంచి మాదాపూర్ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డు వద్ద వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను బుల్లెట్ బైకు ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఇద్దరినీ హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతిచెందారు. బైకు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతిచెందారు. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మృతులు బోరబండ ప్రాంతంలోని నివాసులుగా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యువకుల మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులను రోడ్డు ప్రమాదం కబలించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG High Court: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Collector: ఆ నోటిఫికేషన్లను నమ్మొద్దు..

ఆర్థిక మార్గదర్శి అస్తమయం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 06:19 PM