Share News

TG News: 4కోట్ల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠా అరెస్ట్

ABN , Publish Date - Sep 09 , 2024 | 02:03 PM

Telangana: యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

TG News: 4కోట్ల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠా అరెస్ట్
UPI fraud gang arrested

హైదరాబాద్, సెప్టెంబర్ 9: యూపీఐ (UPI) మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ (Cyberabad Crimes DCP Narasimha) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి రూ.1.72 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు



శంషాబాద్ సీసీఎస్, కేపీహెచ్‌బీ, మాదాపూర్, నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారన్నారు. నిందితులు హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్‌గా చేసుకొని యూపీఐ మోసాలకు రాజస్థాన్ ముఠా పాల్పడిందన్నారు. మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు పాల్పడిన ముఠా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.


మోసం చేయడానికి ముందు కస్టమర్లుగా ఎలక్ట్రానిక్ షో రూమ్‌లకు వెళ్తున్న ముఠా.. ముందుగా వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్స్ షోరూంకు కస్టమర్లుగా వెళ్తోందని చెప్పారు. వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారన్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి క్యూఆర్ కోడ్‌ను రాజస్థాన్‌లోని సహచరులకు పంపగా... క్యూఆర్ కోడ్‌తో రాజస్థాన్‌ని సహచర ముఠా సభ్యులు చెల్లింపు చేస్తున్నారు. వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున తప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటూ బ్యాంకును ఆశ్రయిస్తున్నారు. బ్యాంకు ఆదేశాలతో చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్న ముఠా రాజస్థాన్‌కు చెందిన 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారన్నారు.

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..



యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుందని.. నిందితులపై మూడు కమీషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని వెల్లడించారు. సైబరాబాద్‌లో ఆరు, రాచకొండలో రెండు, హైద్రాబాద్‌లో ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్‌లో ముఠా మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. గత రెండు మూడు నెలల నుంచి బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో 1127 లావాదేవీలు నిందితులు జరిపారన్నారు. ఈ మోసపూరిత లావాదేవీల ద్వారా 1.56 కోట్ల రూపాయలు తిరిగి వాళ్ళ అకౌంట్‌లోకి తిరిగి పొందారని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి

Mahesh kumar: ప్రతీ హామీ అమలు చేసి తీరతాం

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 09 , 2024 | 02:04 PM