Share News

Minister Uttam: ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో భారీ దోపిడీ చేశారు: మంత్రి ఉత్తమ్..

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:10 PM

సీతారామ ప్రాజెక్టు(Sitarama project)ను ఈనెల 15న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) వెల్లడించారు. ఆ రోజున మూడు పంప్ హౌస్‌లను ఓపెన్ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.

Minister Uttam: ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో భారీ దోపిడీ చేశారు: మంత్రి ఉత్తమ్..
Irrigation Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు(Sitarama project)ను ఈనెల 15న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) వెల్లడించారు. ఆ రోజున మూడు పంప్ హౌస్‌లను ఓపెన్ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులను నాశనం చేశారని, లక్ష కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం రూ.లక్ష కోట్లు, పాలమూరు రంగారెడ్డికి రూ.23వేల కోట్లు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.7వేల కోట్లు ఖర్చు చేసినా ఎస్ఎల్బీసీ, డిండి ఇరిగేషన్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు తేలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరిగింది కానీ ఆయకట్టు పెరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాజీవ్, ఇందిరాసాగర్‌లకు గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం మరో రూ.1,500కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవని మంత్రి చెప్పారు. కానీ రీడిజైనింగ్ పేరుతో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగిందని మంత్రి ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు 90శాతం పనులు పూర్తయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు అనడం హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో కేవలం 39శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీ పర్మిషన్ తామే తీసుకొచ్చినట్లు హరీశ్ రావు చెప్తున్నారు, కానీ ఇంతవరకు సీడబ్ల్యూసీ అనుమతులే రాలేదని మంత్రి వెల్లడించారు. అసలు రాజీవ్, ఇంధిరాసాగర్‌లను మార్చి సీతారామ ప్రాజెక్టు చేపట్టడమే తప్పుడు నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 13 , 2024 | 08:10 PM