Share News

TG News: వీసా కన్సల్టెన్సీ యజమాని కిడ్నాప్.. రక్షించిన పోలీసులు

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:15 AM

Telangana: కిడ్నాప్‌కు గురైన వీసా కన్సల్టెన్సీ యాజమానిని పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీసా మంజూరు కోసం చెల్లించిన రూ.4 లక్షలు తిరిగి ఇవ్వాలని వీసా కన్సల్టెన్సీ యజమాని శివశంకర్ రెడ్డిని కిడ్నాపర్స్ కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేశారు.

TG News: వీసా కన్సల్టెన్సీ యజమాని కిడ్నాప్.. రక్షించిన పోలీసులు
Visa Consultancy Owner Kidnapped

హైదరాబాద్, ఆగస్టు 24: కిడ్నాప్‌కు గురైన వీసా కన్సల్టెన్సీ యాజమానిని పోలీసులు (Telangana Police)ఎంతో చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీసా మంజూరు కోసం చెల్లించిన రూ.4 లక్షలు తిరిగి ఇవ్వాలని వీసా కన్సల్టెన్సీ యజమాని శివశంకర్ రెడ్డిని కిడ్నాపర్స్ కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేశారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో దాదాపు ఎనిమిది మంది కలసి శివశంకర్ రెడ్డిని కిడ్నాప్ చేశారు.

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి


కిడ్నాప్ క్రమంలో భార్య, కూతురు అడ్డురాగా వారిని కొట్టి, వస్తువులు ధ్వంసం చేసి మరీ శివశంకర్‌ను కిడ్నాప్ చేశారు నిందితులు. భార్య, కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి శివశంకర్ రెడ్డిని పోలీసులు కాపాడారు. బాధితుడిని రక్షించేందుకు రాచకొండ కంట్రోల్ , నల్గొండ కంట్రోల్ , సైబర్ కంట్రోల్‌లను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వెంబడించి మరీ బాధతుడిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. మొత్తం ఆరు మంది కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Nagarjuna: నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..

Pinnelli: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. హడావుడిగా మాచర్లకు పయనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2024 | 01:15 PM