Share News

Aloe vera Juice: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగితే జరిగేదేంటి?

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:05 AM

కలబంద మొక్కను ఆరోగ్య పరంగా, చర్మ సంరక్షణలో భాగంగా కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే అలోవెరా జ్యూస్ తాగితే ..

Aloe vera Juice: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగితే జరిగేదేంటి?
Aloe vera juice

అలోవెరా లేదా కలబంద మొక్క భారతీయుల చాలా ఇళ్లలో ఉంటుంది. దీన్ని అలంకరణలో భాగంగా కొందరు వాస్తు కోసం మరికొందరు పెంచుతుంటారు. కానీ కలబంద మొక్కను ఆరోగ్య పరంగా, చర్మ సంరక్షణలో భాగంగా కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే అలోవెరా జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

బరువు..

అలోవెరా జ్యూస్ ను ఉదయాన్నే తాగితే బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కలబందలో క్యాలరీలను బర్న్ చేసే సమ్మేళనాలు జీవక్రియను వేగవంతం చేస్తాయి. కలబందలో ఉండే డిటాక్సిపైయింగ్ గుణాలు ప్రేగులను శుభ్రపరుస్తాయి. ఉబ్బరం సమస్యను తగ్గించడం ద్వారా పొట్టను సాధారణ స్థితిలో ఉంచుతాయి. తరచుగా మలబద్దకంతో బాధపడేవారికి మంచి మోషన్ మెడిసిల్ లాగా సహాయపడుతుంది. బరువును సులభంగా తగ్గిస్తుంది.

తెలంగాణలో చాలామందికి తెలియని రహస్య టూరిస్ట్ ప్రాంతాలు ఇవి..!


చర్మం..

మెరిసే చర్మం కావాలి అంటే అలోవెరా జ్యూస్ తాగాలి. అలోవెరా జ్యూస్ శరీరాన్ని శుద్ది చేస్తుంది. మొటిమలు, మచ్చలు లేని చర్మం అలోవేరా జ్యూస్ తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. చర్మం మీద ముడుతలు లేకుండా మృదువుగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఉదయాన్నే అలోవెరా జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.

జీర్ణక్రియ..

అలోవెరా జ్యూస్ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే అలోవెరా జ్యూస్ తీసుకుంటే రోజంతా ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి ఇతర జీర్ణశయాంతర సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్ లు కొవ్వులను విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో కూడా అలోవెరా పనిచేస్తుంది. అలోవెరాలో శరీరానికి చలువ చేసే గుణాలు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

గుండె సమస్యల నుండి వేగంగా కోలుకోవాలంటే ఈ 7 టిప్స్ పాటించండి..!


హైడ్రేట్..

శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో అలోవెరా సహాయపడుతుంది. శరీరం కోల్పోయిన ఎెలక్ట్రోలైట్ లను తిరిగి భర్తీ చేయడంలో అలోవెరా జ్యూస్ సహాయపడుతుంది. వర్కౌట్స్ సమయంలో శక్తివంతంగా, రిఫ్రెష్ గా ఉండటానికి అలోవెరా జ్యూస్ చక్కని ఎంపిక.

రోగనిరోధక వ్యవస్థ..

తరచుగా అనారోగ్యాలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ అలోవేరా జ్యూస్ తాగుతుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. విటమిన్-సి, బి12, విటమిన్-ఇ కలబంద జ్యూస్ లో సమృద్దిగా ఉంటాయి. కలబందలో ఉండే ఫోలిక్ యాసిడ్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కణాలను కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అవిసె గింజలు తింటే ఆడవాళ్లకు ఎన్ని లాభాలంటే..!

ఈ సమస్యలున్న వారు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 24 , 2024 | 11:05 AM