Share News

TG Assembly: హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు.. హరీశ్, భట్టిల మధ్య మాటల యుద్ధం

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:38 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నాడు వాడీవేడిగా నడిచాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది...

TG Assembly: హాట్‌హాట్‌గా  అసెంబ్లీ సమావేశాలు.. హరీశ్, భట్టిల మధ్య మాటల యుద్ధం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నాడు వాడీవేడిగా నడిచాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్ చేసిన వ్యాఖ్యలు, ప్రశ్నలపై ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు.


హరీష్ ఏమన్నారు..?

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారు.. కానీ అసలు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే డోకా పార్టీగా మారిపోయిందని హరీష్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం సభను తప్పుదోవ పట్టించారు. ముఖ్యమంత్రికి తొందరపాటు ఎక్కువ. దానివల్ల ఆ కుర్చి ప్రతిష్ఠ తగ్గుతుంది. సీఎం చెప్పినదాంట్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని లేదు..?. మోటార్లకు మీటర్లు పెడితే FRBM పరిమితి పెంచుతామని కేంద్రం లేఖ రాసింది. 6వేల కోట్ల రుణం తీసుకునే అవకాశం ఉన్నా రైతుల కోసం మేము తిరస్కరించాంఅని హరీష్ రావు అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు.


మాటల యుద్ధం!

మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా మేము మోటర్లకు మీటర్లు పెట్టం. మా సీఎం మీటర్లు పెడతామని ఎక్కడైనా చెప్పారా?’ అని హరీష్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇందుకు మళ్లీ స్పందించిన హరీష్.. ‘భట్టి మాటలు వింటే గోబెల్స్ ఉరేసుకునే వారు. బీర్ మీద పన్నులు వేస్తాం అని బడ్జెట్‌లో పెట్టారు. ధరలు పెంచి పేదల రక్త మాంసాలు పెంచుతామని చెప్పారు’ అనే విషయాన్ని గుర్తు చేశారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘ హరీష్ రావు ఆవు కథ మొదలు పెట్టారు. ఆయనే రిప్లై ఇస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.


ఇచ్చి తీరాల్సిందే..!

ఈ మొత్తం వ్యవహారంపై మళ్లీ హరీష్ స్పందించాల్సి వచ్చింది. ‘ 90లక్షల రేషన్ కార్డులు ఉంటే 500గ్యాస్ సిలిండర్ 40లక్షల మందికే ఇచ్చారు. LRS ఉచితంగానే చేయాలని ప్రతిపక్షంలో ఉండగా రేవంత్, భట్టి, ఉత్తమ్ అన్నారా లేరా..? పేదలకు LRS ఉచితంగా చేయాలి. ఉపాధి హామీ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. కేంద్రం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ బిల్లులు పంచాయితీలకు ఎప్పటిలోగా విడుదల చేస్తారో చెప్పాలి. నియోజక వర్గానికి3500 ఇండ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇవ్వాలి’ అని అసెంబ్లీ వేదికగా హరీష్ డిమాండ్ చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 10:50 PM