Sandhya Theatre Stampede: రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:51 PM
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను దిల్ రాజు పరామర్శించారు. రేవతి కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 24: పుష్పా 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన మంగవారం పరామర్శించారు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత దిల్ రాజ్ విలేకర్లతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతురాలు రేవతి భర్త భాస్కర్‌కు సినిమా పరిశ్రమలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరామని చెప్పారు. మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని తాము కలిస్తామన్నారు.
ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇండస్ట్రీ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తామని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యత తీసుకుంటానని దిల్ రాజు స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సహా ఇండస్ట్రీ పెద్దలను సైతం కలుస్తానన్నారు. సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కృషి చేస్తానని దిల్ రాజు ఈ సందర్భంగా ప్రకటించారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన పుష్పా 2 చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నున్న సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు హీరోహీరోయిన్లు థియేటర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు
ఈ ఘటనలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తోపాటు సినిమా థియేటర్ యాజమాన్యంపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జు్న్ జైలుకు తరలించారు. దీంతో కోర్టును ఆశ్రయించడంతో.. హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు అయింది.
Also Read: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్
అనంతరం ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మాట్లాడారు. దాంతో సినిమా థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చిన సమయానికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్‌లను విడుదల చేసి.. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు సైతం స్పందించారు.
Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్
మరోవైపు మరోసారి విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో మంగవారం ఉదయం చిక్కడపల్లి పోలీసుల ఎదుట అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. ఆ క్రమంలో దాదాపు మూడు గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. అలాంటి వేళ ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పష్టం చేశారు.
For Telangana News And Telugu News