Share News

IAS Officer: స్మితాసబర్వాల్‌ది వివక్షాపూరిత మనస్తత్వం

ABN , Publish Date - Jul 25 , 2024 | 03:25 AM

సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ చేసిన వ్యాఖ్యలను.. ఢిల్లీకి చెందిన ప్రముఖ అడ్వొకసీ గ్రూప్‌ ‘డాక్టర్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌’ తీవ్రంగా ఖండించింది.

IAS Officer: స్మితాసబర్వాల్‌ది వివక్షాపూరిత మనస్తత్వం

  • ఆమెపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

  • అడ్వొకసీ గ్రూపు ‘డాక్టర్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌’ డిమాండ్‌

  • తెలంగాణ సీఎం రేవంత్‌కు ఆ గ్రూపు సభ్యుడి లేఖ

న్యూఢిల్లీ, జూలై 24: సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ చేసిన వ్యాఖ్యలను.. ఢిల్లీకి చెందిన ప్రముఖ అడ్వొకసీ గ్రూప్‌ ‘డాక్టర్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌’ తీవ్రంగా ఖండించింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ గ్రూపు సభ్యుడు డాక్టర్‌ సతేంద్ర సింగ్‌ తెలంగాణ ముఖ్యమంతి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. స్మిత వ్యాఖ్యలు.. వికలాంగుల పట్ల వివక్షాపూరిత మనస్తత్వానికి నిదర్శనంగా, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సమ్మిళిత విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు.


ఆలిండియా సర్వీసెస్‌ (కాండక్ట్‌) రూల్స్‌, 1968 ప్రకారం.. సివిల్‌ సర్వీసె్‌సలో ఉన్నవారు ప్రభుత్వ విధానాలను విమర్శించడం పట్ల నిషేధం ఉందని గుర్తుచేశారు. స్మిత వ్యాఖ్యలు ఆ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. డీవోపీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌), డీఈపీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌) అధికారులు వెంటనే ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 25 , 2024 | 03:25 AM