Share News

iPhone 16: సెలెక్ట్‌ మొబైల్స్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:16 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలక్ట్‌ మొబైల్స్‌ స్టోర్లలో ఐఫోన్‌ 16సిరీస్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

iPhone 16: సెలెక్ట్‌ మొబైల్స్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు

  • అందుబాటులో అద్భుత ఆఫర్లు: సీఎండీ వై.గురు

హైదరాబాద్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెలక్ట్‌ మొబైల్స్‌ స్టోర్లలో ఐఫోన్‌ 16సిరీస్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ వై.గురు శుక్రవారం ఈ ఫోన్లను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాంచింగ్‌ ఆఫర్‌ కింద ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు కొన్న వారికి రూ.5,000 వరకు క్యాష్‌ బ్యాక్‌, రూ.6,000 వరకు అప్‌గ్రేడ్‌ బోనస్‌ పొందవచ్చని తెలిపారు.


ఐఫోన్‌ 16, 16ప్లస్‌, 16ప్రో, 16ప్రో మ్యాక్స్‌ వేరియంట్లు సెలెక్ట్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వినియోగదారులు అతి తక్కువ ఈఎంఐ(24నెలలు)తో ఐఫోన్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకొని ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్‌ కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఎక్స్చేంజ్‌ బోనస్‌ అందిస్తున్నట్లు వివరించారు.

Updated Date - Sep 21 , 2024 | 04:16 AM