Share News

Congress: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే సంజయ్

ABN , Publish Date - Jun 24 , 2024 | 07:17 AM

తెలంగాణలో కాంగ్రెస్‌(congress)లోకి బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్(Sanjay Kumar) అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.

Congress: బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే సంజయ్
Jagtial BRS MLA Sanjay Kumar joins Congress

తెలంగాణలో కాంగ్రెస్‌(congress)లోకి బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్(Sanjay Kumar) అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఎ. రేవంత్ రెడ్డి(revanth reddy) సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్‌కు టీపీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సంజయ్ కుమార్(Sanjay Kumar) కాంగ్రెస్ నేతగా పని చేస్తూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఐదుగురు బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ అధికార పార్టీలో చేరడంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బలం 39 నుంచి 34కి పడిపోయింది. నవంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సంజయ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.


ఇది కూడా చదవండి:

Bhadradri: కంచుమేళం కళాకారుడు, ‘పద్మశ్రీ’ సకిని రామచంద్రయ్య కన్నుమూత

Hyderabad: ఔను.. ఖర్చు రెట్టింపైంది!


Onion Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు, కారణమిదే



For Latest News and Telangana News click here

Updated Date - Jun 24 , 2024 | 08:34 AM