Share News

JNTU: ఇంజనీరింగ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:31 AM

ఎప్‌సెట్‌ మూడోదశ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ అకడమిక్‌ క్యాలండర్‌ను జేఎన్టీయూ అధికారులు సోమవారం విడుదల చేశారు.

JNTU: ఇంజనీరింగ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

  • ఈ నెల 27 నుంచి బీటెక్‌ మొదటి సెమిస్టర్‌ తరగతులు

  • అక్టోబరు 7 నుంచి 11 వరకు దసరా సెలవులు

  • 2025 ఫిబ్రవరి 6 నుంచి సెకండ్‌ సెమిస్టర్‌ మొదలు

హైదరాబాద్‌ సిటీ, ఆగష్టు 12(ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్‌ మూడోదశ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ అకడమిక్‌ క్యాలండర్‌ను జేఎన్టీయూ అధికారులు సోమవారం విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ మొదటి సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు ఈ నెల 19 నుంచి 24 వరకు అవగాహన (ఇండక్షన్‌) పోగ్రామ్‌ ఉంటుందని పేర్కొన్నారు. అకడమిక్‌ క్యాలండర్‌ ప్రకారం.. మొదటి సెమిస్టర్‌ తరగతులు ఈ నెల 27న ప్రారంభమై అక్టోబరు 30 వరకు కొనసాగుతాయి.


మొదటి సెమిస్టర్‌ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉంటాయి. అక్టోబరు 7 నుంచి 11 వరకు దసరా సెలవులుగా పేర్కొన్నారు. కాగా, బీటెక్‌ సెకండ్‌ సెమిస్టర్‌ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై జూన్‌ 24 వరకు కొనసాగుతాయి. మే 12 నుంచి 24 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు జూలై 9 నుంచి ఉంటాయి.

Updated Date - Aug 13 , 2024 | 03:31 AM