Jupally Krishna Rao: అమెరికాకు మంత్రి జూపల్లి
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:09 AM
అమెరికా ఐమెక్స్-2024 పేరిట లాస్‌వేగా్‌సలో జరుగనున్న అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వెళ్లారు.
రేపు లాస్‌ఎంజెల్స్, 9,10న లాస్‌వెగాస్
11న అట్లాంటాలో జరిగే కార్యక్రమాలకు మంత్రి హాజరు
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అమెరికా ఐమెక్స్-2024 పేరిట లాస్‌వేగా్‌సలో జరుగనున్న అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వెళ్లారు. దుబాయ్‌లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఆదివారం అమెరికా చేరుకున్నారు. సోమవారం వాషింగ్టన్ డీసీ వెళతారు. 8న లాస్‌ఎంజెల్స్, 9,10న లాస్‌వెగాస్, 11న అట్లాంటాలో నిర్వహించే పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలు, రోడ్‌షోల్లో మంత్రి పాల్గొంటారు.
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సరఫరాదారులు, కొనుగోలుదారులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ గమ్యస్థానంగా ఐమెక్స్ నిలవనుంది. అమెరికా ఐమెక్స్ అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో అమెరికా, ఇండియా, కెనడా, మెక్సికో, బ్రెజిల్, దుబాయ్ సహా పలు దేశాలు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. అలాగే అక్కడ ఉన్న ప్రవాసీ తెలంగాణ కుటుంబాలు నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో మంత్రి జూపల్లి పాల్గొంటారని, 12న ఆయన భారత్ తిరిగి చేరుకొంటారని అధికారులు పేర్కొన్నారు.